తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలే కాదు.. బస్సులో వెళ్తానన్నా ఓకే... - స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వలస కార్మికులు‘

స్వస్థలాలకు వెళ్లేందుకు ‘శ్రామిక్‌’ రైళ్లు కాకుండా సొంత రవాణా ఏర్పాట్లు చేసుకుంటున్న వలస కార్మికులకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తున్నారు. ‘ఎమర్జెన్సీ ఇంటర్‌స్టేట్‌ వెహికల్‌ పాస్‌’ పేరుతో పాసులు మంజూరు చేస్తున్నారు.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 7, 2020, 12:09 PM IST

సొంతూళ్లకు వెళ్లేందుకు భాగ్యనగరంలోని వలస కార్మికులు... బస్సులు సమకూర్చుకుంటున్నాం అంటూ పోలీస్‌ ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నారు. బస్సుల కండిషన్‌, రవాణాశాఖ అధికారుల ధ్రువపత్రాలను పరిశీలించి, వెళ్తున్న దూరాన్ని లెక్కగట్టి పోలీలుసులు పాస్‌లు మంజూరు చేస్తున్నారు. ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని, వచ్చేటప్పుడు బస్సు ఖాళీగా రావాలంటూ షరతులు విధిస్తున్నారు.

బుధవారం ఒక్కరోజే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధుల్లో వందకుపైగా బస్సులకు అనుమతులిచ్చారు. 36 సీట్లున్న బస్సులో 20 మంది మాత్రమే వెళ్లాలని, సరిహద్దుల్లో పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఎక్కువ మంది ఉంటే బస్సు సీజ్‌ చేస్తామని హెచ్చరించి పంపుతున్నారు.

రైళ్లల్లో ఆలస్యమవుతోందని...

స్వస్థలాలకు శ్రామిక్‌ రైళ్లలో వెళ్తే ఆలస్యమవుతుందన్న భావనతో కొందరు వలస కార్మికులు రవాణా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ యజమానుల ద్వారా ప్రైవేటు బస్సులు మాట్లాడుకుంటున్నారు. ఆయా రైల్వేస్టేషన్లకు వలస కూలీలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

అంతరాష్ట్ర సరిహద్దులకు సమాచారం...

వలస కార్మికులతో వెళ్తున్న బస్సుల వివరాలను అంతర్రాష్ట్ర సరిహద్దుల చెక్‌పోస్టులకు సమాచారమిస్తున్నాం. పాస్‌లు మంజూరు చేసి.. కార్మికులు వెళ్తున్న బస్సులను, వారి ధ్రువపత్రాలను ఎస్సైలు తనిఖీ చేస్తున్నారు.

-పి.విశ్వప్రసాద్‌, సంయుక్త కమిషనర్‌, మధ్యమండలం

ABOUT THE AUTHOR

...view details