రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సన్న బియ్యం సరఫరాలో పారదర్శకంగా ఉండేందుకు ఈ- పాస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 28,623 ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ కోటాను ఈ-పాస్ విధానం ద్వారా సరఫరా చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 3,965 సంక్షేమ వసతి గృహాల్లో 8.76 లక్షల మంది విద్యార్థులున్నారు. 28,623 ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న 23,87,751 మంది విద్యార్థులకు ప్రతి నెల 12 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుందని మంత్రి వివరించారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఈ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
ఈ-పాస్ విధానంలో పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా - సరఫరా
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సన్న బియ్యం సరఫరాలో పారదర్శకంగా ఉండేందుకు ఈ- పాస్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ-పాస్ విధానంలో పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా
ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాలకు, సంక్షేమ హాస్టళ్లకు ఈ-పాస్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఏ రోజు ఎంతమంది ఎన్ని క్వింటాళ్ల బియ్యం తీసుకెళ్లారు, ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోచ్చని మంత్రి వివరించారు. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : పోలీసులపైకి రాళ్లు రువ్విన దేవుళ్ల తండా ప్రజలు