తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల జంటకు వివాహం - హైదరాబాద్ జిల్లా తాజా వార్తలు

ఓ దివ్యాంగుల జంటకు వివాహం జరిపించి పలువురికి ఆదర్శంగా నిలిచారు మొగుళ్లపల్లి యువసేన, అమ్మా షౌండేషన్ సభ్యులు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ.. పెళ్లి నిర్వహించారు.

దివ్యాంగుల జంటకు వివాహం జరిపించిన అమ్మ ఫౌండేషన్ సభ్యులు
Amma Foundation, which married a disabled couple

By

Published : May 22, 2021, 7:53 PM IST

హైదరాబాద్‌ మలక్‌పేటలోని లూయిస్‌ బ్రెయిలీ పార్క్‌లో మొగుళ్లపల్లి యువసేన, అమ్మా షౌండేషన్ ఆధ్వర్యంలో ఓ దివ్యాంగుల జంటకు వివాహం జరిపించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి నిర్వహించారు.

వివాహానికి బంగారు పుస్తెలు, మట్టెలు, ఒడిబియ్యం అందించామని మొగుళ్లపల్లి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉపేంద్రగుప్తా తెలిపారు. నిరుపేదలను ఆదుకోవడానికి తమ సంస్థ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు.

ఇదీ చదవండి:సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

ABOUT THE AUTHOR

...view details