కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ రక్తదానం చేశారు.
''కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి
మాగంటి గోపినాథ్ మూడు నెలల నుంచి కష్టపడ్డాడు. పక్క ప్లాన్ వేసుకుని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో రక్తదానం చేయడమనేది చాలా గొప్ప విషయం. రక్తం లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమం వారికెంతో ఉపయోగపడుతుంది. తన రక్తం దానం చేసి... కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు నా అభినందనలు. చాలా మంది రాజకీయ నాయకుల వారసులు పాలిటిక్స్‌లోకి వస్తారు. కానీ మంత్రి కేటీఆర్ తను చేసే పనులతో తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ''