Media conference on TRVKS PRC: టీఎస్ ట్రాన్స్‌కో అండ్ టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుని టీఆర్వీకేఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ఇతరులు కలశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు చెప్పిన వివరాలు ప్రకారం.. టీఎస్ ట్రాన్స్‌కో అండ్ టీఎస్ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి హైదరాబాద్‌లో వారి నివాసంలో కలసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామన్నారు. ఆయన విపరీతమైన దగ్గు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని చెప్పారు.
'పీఆర్సీ నూటికి నూరు శాతం అమలు చేస్తాం' - TRVKS secratry press meeting
Media conference on TRVKS PRC: పీఆర్సీపై వార్త పత్రికల్లో వస్తున్న కథనాలుపై టీఎస్ ట్రాన్స్‌కో అండ్ టీఎస్ జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టత ఇచ్చారు. ఈరోజు టీఆర్వీకెఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆరోగ్యం గురించి, పీఆర్సీ వంటి విషయాలను తెలిపారు.
పీఆర్సీపై నూటికి నూరు శాతం అమలు చేస్తాం
కొన్ని పత్రికల్లో పీఆర్సీపై వస్తున్న కథనాలుపై ఆయన స్పందించారు. పీఆర్సీపై ఎటువంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని నూటికి నూరు శాతం అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. తన ఆరోగ్యం కుదుట పడిన వెంటనే విధుల్లోకి చేరుతారని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల ప్రధాన సమస్యలను టీఆర్వీకేఎస్ సంఘ పక్షాన పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఆర్వీకెఎస్ సంఘానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: