Medals for State Police: గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక భారత పోలీసు పతకాలను ప్రకటించింది. దేశంలో ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తుగా ఈ పతకాలు అందజేస్తారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది.
ఈ సంవత్సరం దేశంలో 901 మందికి పోలీసు పతకాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో పలువురికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పతకాలు ప్రకటిస్తుంటుంది. ఈసారి రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకానికి పోలీస్ శాఖ నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది.
- 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణ
- ఇంటిలిజెన్స్ ఆదనపు డీజీ అనిల్ కుమార్
- జాతీయ పోలీస్ అకాడమీ జేడీ మధుసూదన్ రెడ్డి ఎంపిక అయ్యారు. అదే విధంగా రాష్ట్రంలో 140 మంది పోలీస్ గ్యాలంట్రీ పతకాలకు ఎంపిక అయ్యారు. 93 మందిని ప్రెసిడింట్ పోలీస్ మెడల్స్‌కి, 668 మందిని పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.