బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆన్లైన్లో మందులు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ వస్తుందని ఆశపడి తన కూతురు ద్వారా ఆన్లైన్లో బుక్ చేయించాడు. కానీ మందుల ఆర్డర్ ఇంటికి వచ్చాక చూసి షాక్ అయ్యాడు. టాబ్లెట్లు ఉన్నట్టే ప్యాకెట్ ఉంది. కానీ అందులో మందు గోలీలు లేవని వాపోయాడు. ఒక్కో టాబ్లెట్ విలువ 780 రూపాయలని, దాదాపు 20కి పైగా మెడ్‌ప్లస్ కంపెనీకి చెందిన టాబ్లెట్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆరు నెలల పాటు మాత్రలు కరెక్ట్‌గానే వచ్చాయని, నిన్న మందుల ప్యాకెట్లో మాత్రలు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని వివరించారు.
డిస్కౌంట్ కోసం ఆశపడితే.. ఖాళీ అర్డర్ వచ్చింది - ఆన్లైన్లో మందులు
ఆన్లైన్లో మందులు కొనుగోలు చేస్తే డిస్కౌంట్ వస్తుందని ఆశపడ్డాడు. కానీ అర్డర్ ఇంటికి వచ్చాక చూస్తే అందులో టాబ్లెట్లు లేవు. ఖాళీ ప్యాకెట్ మాత్రమే వచ్చింది. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పరిధిలో చోటు చేసుకుంది.
డిస్కౌంట్ కోసం ఆశపడితే.. ఖాళీ అర్డర్ వచ్చింది