హైదరాబాద్ లాలాపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమ్మతు పనులు మందకొడిగా సాగడంపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్లతో కలిసి పరిశీలించారు. మరమ్మతు పనులు ప్రారంభమై మూడు నెలలైనా ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా... కూలీలు, ప్రత్యేక పర్యవేక్షక ఇంజినీర్లను నియమించాలని ఆదేశించారు.
ఆర్వోబీ పనుల తీరుపై మేయర్ ఆగ్రహం - హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్
హైదరాబాద్ లాలాపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమ్మతు పనుల్లో జాప్యంపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేయర్ బొంతు రామ్మోహన్