సికింద్రాబాద్లోని మచ్చ బొల్లారం మార్కెట్ వద్ద వినియోగదారులకు, అభాగ్యులకు అల్వాల్ పోలీసులుమాస్కులు, శానిటైజర్లు అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మాస్కులు పంపిణీ చేసిన పోలీసులు - సికింద్రాబాద్ తాజా వార్తలు
విపత్కర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు పోలీసులు కూడా తమ వంతు సాయం చేస్తూ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.
మాస్కులు పంపిణీ చేసిన పోలీసులు
అల్వాల్ ఇన్స్పెక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస్కులను అందించి వారికి కరోనాపై అవగాహన కల్పించారు. అనవసరంగా బయట తిరగకుండా భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి :విద్యార్థులూ... మానసిక సమస్యలుంటే ఫోన్ చేయండి