వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. న్యూ రెడ్డి ఎన్క్లేవ్, శ్రీనివాస్ నగర్లో భర్త శశికాంత్ రావు కట్నం కోసం వేధిస్తున్నాడని... ప్రత్యూష ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.
ప్రత్యూషకు శశికాంత్రావుతో 2013లో వివాహం జరిగింది. కిలో బంగారం 20 లక్షల నగదు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అదనంగా 50 లక్షల కట్నం కూడా ఇచ్చామని తండ్రి కిషన్ రావు తెలిపారు. అయినప్పటికీ తన కూతురిని ఎన్నోమార్లు అదనపు కట్నం కోసం వేధించాడని వాపోయారు. ప్రత్యూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య - hyderabad
కిలో బంగారం, 20 లక్షల నగదు అల్లుడికి ముట్టజెప్పి ఘనంగా పెళ్లి చేశాడు ఓ తండ్రి. అయినా భర్తకు ఆ సొమ్ము సరిపోలేదు. మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించాడు. ఫలితంగా ఆ తండ్రికి కడుపుకోత మిగిలింది.
వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఇవీ చూడండి: నాగుపామును మింగిన 'శభాష్'పల్లి కోడి