తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగుతోనే ప్రేమాభిమానాలు, సంస్కృతి : శైలజా కిరణ్‌

హార్డ్ వర్క్ ఎప్పటికీ వృథా కాదని.. మన కష్టం ద్వారా వచ్చిన ఫలితం ఎంతో మాధుర్యంగా ఉంటుందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ 27వ వార్షికోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శైలజా కిరణ్‌

By

Published : Nov 23, 2019, 9:37 PM IST

Updated : Nov 23, 2019, 11:24 PM IST

తెలుగు చదువుకోవటం మానేస్తే.. ప్రేమాభిమానాలు, సంస్కృతి, సంతోషం మాయమైపోతాయనే భయం కలుగుతోందని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ 27వ వార్షికోత్సవానికి శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య కనీస అవసరాల్లో ఒకటని.. పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు చేసే ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

లైఫ్ స్కిల్స్, క్రమశిక్షణ

విద్య విజ్ఞానంతో పాటు.. ఉపాధిని, జీవితాన్ని అందిస్తుందని.. విద్యా సముపార్జనలో పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా.. లైఫ్ స్కిల్స్, క్రమశిక్షణ పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

తెలుగుతోనే ప్రేమాభిమానాలు, సంస్కృతి : శైలజా కిరణ్‌

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Last Updated : Nov 23, 2019, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details