హైదరాబాద్లో మామూలు రోజుల్లో లాగానే వాహనాల రద్దీ ఉండటం వల్ల వాహనదారులను ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ... ప్రతి ఒక్కరూ బయటకు రావడం వల్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్లెక్కుతున్నారా జాగ్రత్త... డైరెక్ట్ పోలీస్స్టేషనే...!
రోడ్లపై వాహనదారులు చక్కర్లు కొడుతున్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పట్టింపు లేకుండా ఇష్టారీతిగా రోడ్లపై సంచరిస్తున్నారు. హైదరాబాద్లోని సంగీత్, రాణిగుంజ్, బేగంపేట, ఓలిఫెంటా బ్రిడ్జితో పాటు పలు కూడళ్ళ వద్ద తిరుగుతున్న వాహానాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.
రోడ్లెక్కుతున్నారా జాగ్రత్త... డైరెక్ట్ పోలీస్స్టేషనే...!
లాక్డౌన్ అమలవుతున్న సమయంలో వాహనదారులు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పినా పట్టించుకోకపోవటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు 40 వాహనాలు సీజ్ చేశారు. మారేడ్పల్లి వద్ద 25 వాహనాలను సీజ్ చేశారు.