ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఖమ్మం విద్యార్థిని స్పందన మృతి చెందిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వసతి గృహాల్లో సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. గురుకుల పాఠశాలలను ప్రోత్సహిస్తున్నామనే పేరుతో... సంక్షేమ హాస్టళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. 20 మంది పట్టే నివాస గృహాల్లో ఎనభై మందిని ఉంచుతున్నారని, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు అదనపు గదులు, వసతుల కల్పించకుండా గాలికొదిలేశారని విమర్శించారు. వసతి గృహాల్లో లోపాలు, గురుకులాల్లో పాఠశాల నిర్వహణపై రెండు అధ్యయన కమిటీలు వేస్తామని పేర్కొన్నారు. ఆ కమిటీ నివేదిక అందిన వెంటనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.
'సంక్షేమ హాస్టళ్లపై ఎమ్మార్పీఎస్ అధ్యయన కమిటీలు' - ప్రభుత్వ నిర్లక్ష్యం
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై, వసతి గృహాల్లో సదుపాయాలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఖమ్మం విద్యార్థిని స్పందన మృతి చెందిందని ఆరోపించారు.
"సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం"