27న హైదరాబాద్లో అంబేడ్కర్వాదుల మహాగర్జన - మంద కృష్ణ మాదిక
ప్రశ్నిస్తే కేసులు పెట్టే కేసీఆర్ వైఖరిని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ నెల 27న హైదరాబాద్లో అంబేడ్కర్ వాదుల మహాగర్జన నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు.
ఈనెల 27న హైదరాబాద్లో అంబేడ్కర్వాదుల మహాగర్జన
తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం, ఆయన విగ్రహానికి అవమానం జరిగినప్పుడు స్పందించకపోవటాన్ని దేశానికి తెలియజేస్తామన్నారు. గృహ నిర్బంధం పెట్టినా ఇంట్లో ఉండి అందరిని ఏకం చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే దానికి కాళేశ్వరంగా పేరు మార్చారని ఆక్షేపించారు.
Last Updated : Apr 18, 2019, 4:39 PM IST