యెమన్ దేశానికి చెందిన మహ్మద్ ఒత్మన్ అలీ (24) తన బంధువు ఫైజల్ మబ్కోత్ హసన్‌తో కలిసి హైదరాబాద్ టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో ఉంటున్నాడు. చదువు కోసం ఇక్కడకు వచ్చి యూసఫ్‌గూడలో డిగ్రీ చేస్తున్నాడు. మహ్మద్ ఒత్మన్ అలీకి తొమ్మిది నెలల కిందట యెమన్ దేశానికి చెందిన యువతితో నిశ్చితార్థమైంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడంతో మానసికంగా దగ్గరయ్యారు. మూడు నెలల క్రితం ఆ యువతి క్యాన్యర్‌తో మృతిచెందింది. ఒత్మన్ మానసికంగా కుంగిపోయాడు.
'నువ్వు లేని జీవితం నాకొద్దు'
వాళ్లిద్దరికి నిశ్చితార్థమైంది. వారి మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ ఏర్పడింది. ఇంకొన్ని రోజుల్లో వివాహం జరగనుండగా.. ఇంతలో యువతి క్యాన్సర్‌తో మృతిచెందింది. ఆ ఘటనతో యువకుడు మానసికంగా కుంగి పోయాడు. ఆమె లేని జీవితం వృథా అనుకుని... ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదే సమయంలో వీసా గడువు ముగుస్తున్నట్లు ఎఫ్ఆర్ఆర్ఓ నుంచి సమాచారం వచ్చింది. భారత్ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మానసికంగా కుంగిపోయి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికోచ్చిన అతని బంధువు మబ్కోత్ హసన్ విషయం గుర్తించగా అప్పటికే చనిపోయాడు. ఘటనాస్థలంలో ఒత్మన్ తను పెళ్లి చేసుకోవాలనుకున్న యువతిని ఉద్దేశించి రాసిన లేఖ పోలీసులు స్వాధినం చేసుకున్నారు. ఆ లేఖలో... 'నువ్వు లేని జీవితం చాలా బోర్‌గా ఉంది... నువ్వు లేని లోకంలో నేనుండలేను... వస్తున్నానంటూ...' పేర్కొన్నాడు. ప్రాథమికంగా పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: చరిత్ర ఘనం... ఆదరణ శూన్యం