వరంగల్‌కు చెందిన నాగపూరి నాగరాజ్ గౌడ్ హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ వితంతువును పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు సైదాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. మ్యాట్రిమోనిలో బాధితురాలి వివరాలు తెలుసుకుని ఆసరాగా ఉండి, ఆశ్రయం ఇస్తానని నమ్మించాడు. ఆమె నుంచి రూ. 5 లక్షల నగదు రాబట్టాడు. సొమ్ము చేతికందగానే పరారయ్యాడు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంత్రి అనుచరులమంటూ తనను బెదిరిస్తున్నారని వాపోయింది.
నమ్మించి మోసం చేశాడు... వితంతువు ఆవేదన - marriege
ఈ మధ్య పెళ్లిసంబంధాల సైట్ల సాయంతో మోసం చేయడం సాధారణమైంది. మ్యాట్రిమోనిలో ఓ వితంతువు వివరాలు తెలుసుకుని ఆమెకు అండగా ఉంటానంటూ మాయ మాటలు చెప్పి నగదు రాబట్టాడు ఓ వ్యక్తి.
బాధితురాలు