తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న లారీ.. హమాలీ దుర్మరణం - అల్వాల్​ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొనడం వల్ల వ్యక్తి చనిపోయిన ఘటన సికింద్రాబాద్‌ అల్వాల్‌ పరిధిలో చోటుచేసుకుంది. తూముకుంట నుంచి హకీంపేట్‌ వైపు వస్తున్న లారీ చెట్టును ఢీకొనడం వల్ల వాహనం వెనుక భాగంలో ఉన్న శ్యామ్‌ అనే హమాలీ కిందపడి గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడం వల్ల మరణించినట్లు పోలీసులు తెలిపారు.

చెట్టును ఢీకొన్న లారీ.. హమాలీ దుర్మరణం
చెట్టును ఢీకొన్న లారీ.. హమాలీ దుర్మరణం

By

Published : Jul 10, 2020, 6:41 AM IST

సికింద్రాబాద్‌ అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తూముకుంట నుంచి హకీంపేట్ వైపు వస్తున్న లారీ మూల మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో లారీ వెనుక భాగంలో ఉన్న శ్యామ్‌ కిందపడి గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడం వల్ల అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మరణించిన శ్యామ్.. కొంపల్లికి చెందినవాడిగా అల్వాల్‌ పోలీసులు గుర్తించారు. మృతుడు స్క్రాబ్ దుకాణంలో హమాలీగా పనులు నిర్వహించే వాడన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి:కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ABOUT THE AUTHOR

...view details