తెలంగాణ

telangana

ETV Bharat / state

నిషేధిత గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు - హైదరాబాద్ వార్తలు

హైదరాబాద్​ షాహినాయత్​ గంజ్​ పీఎస్​ పరిధి జోషిగూడలోని అరినాధ ఏజెన్సీపై మధ్య మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడి చేసి గుట్కా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.12వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Man arrested for selling banned gutka in hyderabad
నిషేధిత గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

By

Published : Jul 30, 2020, 7:01 PM IST

నిషేదిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న వినయ్ కుమార్ అనే వ్యక్తిని మధ్య మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​ షాహినాయత్ గంజ్ పీఎస్​ పరిధి జోషిగూడలోని అరినాధ ఏజెన్సీపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుడితో పాటు 12 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని షాహినాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details