ఎంఐఎం కార్యకర్తలు తమ ప్రచార వాహనం బ్యానర్లను చింపివేశారంటూ మల్లేపల్లి డివిజన్ భాజపా అభ్యర్థి భర్త పవన్‌కుమార్ హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్లను చింపివేసి ఎంఐఎం స్టికర్లను అతికించారని ఆయన ఆరోపించారు.
మల్లేపల్లిలో ఎంఐఎం కార్యకర్తలపై భాజపా ఫిర్యాదు - హైదరాబాద్ తాజా వార్తలు
తమ ప్రచార వాహనం బ్యానర్లను చింపి వేశారంటూ ఎంఐఎం కార్యకర్తలపై మల్లేపల్లి డివిజన్ భాజపా అభ్యర్థి భర్త పవన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఎంపీ సోయం బాపూరావు కూడా పాల్గొన్నారు.
మల్లేపల్లిలో ఎంఐఎం కార్యకర్తలపై భాజపా ఫిర్యాదు
తమ డివిజన్లో ఎంఐఎం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని పవన్‌కుమార్ హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంపీ సోయం బాపూరావు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.