తెలంగాణ

telangana

ETV Bharat / state

అనితపై దాడికి నిరసనగా మహిళా కాంగ్రెస్ మౌనదీక్ష​

అత్యాచార నిందితులు,మహిళలపై దాడికి దిగే వారిని కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్​ ప్యారడైజ్  గాంధీ విగ్రహం వద్ద  మౌన దీక్ష చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసి మహిళా మంత్రిని నియమించాలన్నారు. లోకాయుక్తను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ మహిళల మౌన దీక్ష

By

Published : Jul 2, 2019, 5:21 PM IST

మహిళలను రక్షించండి మానవ మృగాలను శిక్షించండి అంటూ సికింద్రాబాద్ ప్యారడైజ్ గాంధీ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రానికి అసలు హోంమంత్రి ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ఆకృత్యాలు, అత్యాచారాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు. హోమాలు చేయడానికి, స్వామీజీలను కలవడానికి కేసీఆర్​కు సమయం ఉన్నప్పడు...అత్యాచార బాధితులను పరామర్శించడానికి సమయం లేదా అని ప్రశ్నించారు.
అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఘటనకు కారకులైన తెరాస నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలంతా చైతన్యవంతులై ఎవరైనా దాడి చేయాలని ప్రయత్నస్తే ప్రతి దాడి చేయాలని ఆమె సూచించారు.

ఎవరైనా మహిళలపై దాడికి యత్నస్తే ప్రతి దాడి చేయాలి : ఇందిరా శోభన్

ABOUT THE AUTHOR

...view details