కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహానంది క్షేత్రం నీట మునిగింది. పుష్కరిణి పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయ కోనేరు నీటితో నిండిపోయి ముఖ ద్వారం గుండా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వస్తోండటంతో పంచలింగాలు మునిగిపోయాయి. క్షేత్రాన్ని వరద నీరు చుట్టుముట్టటంతో దర్శనాలు నిలిపివేశారు.
కర్నూలులో భారీ వర్షం.. 'నీట మునిగిన మహానంది'
కర్నూలులో కురుస్తున్న భారీ వర్షాలకు మహానంది పుణ్యక్షేత్రం నీట మునిగింది. ఆలయంలోని పంచలింగాలు మునిగిపోగా సమీపంలోని పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
నంద్యాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానకు పట్టణంలోని రోడ్లు జలమయమయ్యాయి. నంద్యాల, గోస్పాడు, మహనంది, సిరివెల్ల మండలాల్లో భారీ వర్షం రావటంతో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లన్ని దెబ్బతిన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మహానంది సమీపంలోని పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తోంది. మహానంది సమీపంలోని వ్యవసాయ కాలేజీ, ఉద్యాన, పశుపరిశోధనా స్థావరాల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఫలితంగా దగ్గర్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాలు నీట మునిగాయి.
ఇదీ చూడండి:రొట్టెల పండుగకు... ఏడు లక్షల మంది భక్తుల రాక