తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...! - psamaneni prasad

ఏమి జరిగినా కాపాడడానికి తన తండ్రి ఉన్నాడనుకుని... ఓ ఎమ్మెల్యే కుమారుడు నిబంధనలు అతిక్రమిస్తూ, అడ్డుకోబోయిన పోలీసుపై దాడి చేశారు.

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...!

By

Published : Jul 31, 2019, 3:45 PM IST

ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్​భాను కుమారుడు ప్రసాద్ హైటెక్స్ కమాన్​ వైపునుంచి నిబంధనలు అతిక్రమించి కారు నడిపాడు. ఖానామెట్​ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్​ కృష్ణ వారిని అడ్డుకున్నాడు.
కారులోంచి దిగిన ప్రసాద్ కానిస్టేబుల్​తో వాగ్వాదానికి దిగాడు. నన్ను నువ్వు అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్​ను దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న మాధాపూర్ సీఐ రాజగోపాల్​రెడ్డి అక్కడకు చేరుకుని వారించే ప్రయత్నం చేశారు. సామినేని ప్రసాద్ వినకపోవడం వల్ల స్టేషన్​కు రావాల్సిందిగా ఇన్​స్పెక్టర్ కోరారు.
నన్న స్టేషన్​కు రమ్మంటావా అంటూ ఇన్​స్పెక్టర్​ను పక్కకు నెట్టి... కాలుతో తన్ని దూషింటాడు. విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని మాదాపూర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఎమ్మెల్యే తనయుడిపై 332, 353,506 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఎవడైతే నాకేంటి? మా నాన్న ఎమ్మెల్యే...!

ABOUT THE AUTHOR

...view details