తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరకుకు పెరగని మద్దతు ధర... తగ్గుతున్న సాగు - sugar

తీపిని పంచే చెరకు రైతుకు.. నష్టాల చేదు తప్పడం లేదు. ఈ ఏడాది చెరకుకు కేంద్రం ధర పెంచలేదు.  ఏటా పెరిగిపోతున్న పెట్టుబడులతో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. మద్దతు ధర పెంచితే తప్ప గిట్టుబాటు కాదని రాష్ట్ర చక్కెరశాఖ స్పష్టం చేసింది.

చెరకుకు పెరగని మద్ధతు ధర... తగ్గుతున్న సాగు

By

Published : Jul 28, 2019, 11:38 AM IST

చెరకు రైతులకు కేంద్రం ఈ ఏడాది మొండి చేయి చూపింది. గతేడాది టన్నుకు 2,750 రూపాయలు చెల్లించి కర్మాగారాలు కొలుగోలు చేశాయి. ఈ సారి కూడా కేంద్రం అదే ధరను నిర్ణయించటం వల్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టన్ను చెరకు ఉత్పత్తికి 3,400 రూపాయలు అవుతుందని చక్కెర శాఖ, జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ నిర్ధరించాయి. టన్నుకు 3,500 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని చక్కెరశాఖ సీఏసీపీకి సిఫారసు చేసింది.

ఖర్చులు పెరిగిపోతున్నా... మద్దతు ధర పెంచకపోవడం అన్యామని రైతులు వాపోతున్నారు. పంట పండిన తర్వాత మిల్లుకు తరలించేందుకు కూలీలు టన్నుకు 800 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తుండగా... రవాణా ఛార్జీలు అదనం. టన్నుకు 2,750 రూపాయలు ఇస్తే... తమకేమీ మిగిలదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు లేకపోవటం వల్ల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాల నుంచి 70 వేల ఎకరాలకు తగ్గిపోయింది. ధర 3,500కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా... కేంద్రం పెంచలేదని చక్కెర శాఖ సంచాలకులు డాక్టర్ భద్రు మాలోత్‌ అన్నారు.

చెరకుకు పెరగని మద్ధతు ధర... తగ్గుతున్న సాగు

ఇదీ చూడండి: జైపాల్​రెడ్డి: దక్షిణాది తొలి ఉత్తమ పార్లమెంటేరియన్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details