హైదరాబాద్ శివారు మేడిపల్లి ఠాణా పరిధిలో విషాదం జరిగింది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట మేడిపల్లిలోని ఓ హోటల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పల్ బజాజ్ షోరూంలో పనిచేస్తున్న అజయ్, మెట్రోమాల్‌లో పనిచేస్తున్న పిర్జాదిగూడకు చెందిన శ్రావణి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పగా పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి
ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని పెద్దల ముందు ఉంచారు. వారు అంగీకరించకపోవడం వల్ల కనీసం చావులోనైనా ఒక్కటవుదామని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి మృతి చెందగా... యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు మేడిపల్లి ఠాణా పరిధిలో జరిగింది.
విషం తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి మృతి
మేడపల్లిలోని ఓ హోటల్ గదిలో విషం తాగారు. గమనించిన హోటల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే శ్రావణి మృతి చెందింది. కొనఊపిరితో ఉన్న అజయ్‌ను ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన