భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా.. మతోన్మాదులు ప్రేమికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 'వాలెంటైన్స్ డే'ను పురస్కరించుకొని.. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి.. ప్రేమికులకు శుభాకాంక్షలు తెలిపారు.
'మతోన్మాదుల వల్ల ప్రేమికులు భయపడుతున్నారు' - హైదరాబాద్ ట్యాంక్‌బండ్
మతోన్మాదుల వల్ల ప్రేమికులు భయబ్రాంతులకు గురవుతున్నారని.. హైదరాబాద్‌లోని క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం కొన్ని శక్తులు సంబురాలను అడ్డుకుంటున్నాయని మండిపడింది.
'మతోన్మాదుల వల్ల ప్రేమికులు భయపడుతున్నారు'
ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతోంటే.. రాష్ట్రంలో మాత్రం కొన్ని శక్తులు సంబురాలను అడ్డుకుంటున్నాయని మత్తయ్య మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుశాఖలు.. మతోన్మాదులను నివారించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఇదీ చదవండి:వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!