తెలంగాణ

telangana

ETV Bharat / state

రవళి పరిస్థితి విషమం - ప్రేమోన్మాదుల దాడులు

ప్రేమోన్మాది దాడికి గురైన రవళి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని యశోద వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితుడు సాయి అన్వేశ్​ను కోర్టులో హాజరుపర్చగా, మార్చి 14 వరకు రిమాండు విధించారు.

యశోద వైద్యులు

By

Published : Feb 28, 2019, 11:50 PM IST

ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన రవళి పరిస్థితి విషమం
వరంగల్‌లో మొన్న ప్రేమోన్మాది దాడికి గురైన రవళి ఆరోగ్య పరిస్థితి ఇంకా అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నామని సికింద్రాబాద్‌ యశోద వైద్యులు తెలిపారు. ప్రముఖ న్యూరో డాక్టర్ల బృందం వైద్యం అందిస్తున్నారు. నిన్నటి కంటే పరిస్థితి మెరుగవుతుందనే అనుకున్నప్పటికి ఆమెలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. మరోవైపు ఆమెపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ప్రేమోన్మాదిని వరంగల్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నిందితుడికి మార్చి 14వరకు రిమాండు విధించారు. అన్వేశ్​ను కఠినంగా శిక్షించాలంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు.

ఇవీ చూడండి :డాక్టర్ కాముడు

ABOUT THE AUTHOR

...view details