తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమిస్తే చంపే హక్కుందా? - attraction

ప్రేమ ఎంతో మంది యువతీయువకులకు మధురానుభూతిని కల్గిస్తుంది. మరి ప్రేమిస్తే ఒకరినొకరు చంపుకునే హక్కుందా..? అంగీకరించకపోతే హత్య చేయాలా? కొంత మంది ఉన్మాదులు తనకు దక్కనిది ఎవ్వరికి దక్కకూడదు అనే ఆలోచనతో ప్రేమించిన వారినే చంపుతున్నారు.

ప్రేమిస్తే చంపే హక్కుందా?

By

Published : Feb 27, 2019, 4:04 PM IST

మొన్న మధులిక.. నేడు రవళి. ఇద్దరూ ప్రేమోన్మాదుల చేతుల్లో చావు వరకు వెళ్లొచ్చారు. ప్రేమను అంగీకరించక పోతే ఆ యువకుడి చేతిలో చావాల్సిందేనా..!20 ఏళ్లు కడుపులో పెట్టి పెంచుకున్న తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు..జీవితంలో ఎంతో సాధించాలనుకున్న కళలు.. ఇవన్నీ మంటల్లో కలిసిపోవాల్సిందేనా?కనిపెంచిన తల్లిదండ్రులకే చంపేహక్కు ఉండదు. ప్రేమిస్తున్నామంటూ వచ్చి... ప్రేమను అంగీకరించకపోతే వారికి చంపే హక్కు ఎక్కడిది..?

నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. తాము ప్రేమించినవాళ్లు ఎక్కడున్న సంతోషంగా ఉండాలనుకుంటారు. ఒక అమ్మాయికి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెప్పే జాగ్రత్తలు...అదే తన కొడుకుకు ఏ అమ్మాయి జోలికి పోవద్దురా.. అని చెప్పే రోజు వచ్చినప్పుడే ఇలాంటి దారుణాలను అరికట్టవచ్చు.

ఇవీ చదవండి:యువతికి నిప్పంటించాడు

ABOUT THE AUTHOR

...view details