హైదరాబాద్ వనస్థలిపురం రెడ్ ట్యాంక్ సమీపంలో అట్ట ముక్కలు, చిన్నారులు తినే రంగురంగుల జెమ్స్తో లంబోదరుని విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. ఈ బొజ్జ గణపయ్యను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న చిన్నారులతో పాటు పెద్దలు కూడా వస్తున్నారు. జెమ్స్ గణేశాకు జై అంటూ చిన్నారులు నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు.
జై జై జెమ్స్ గణేశా! - vinayaka
మట్టి గణపతిని చూశాం, టెక్నికల్ గణేశుని గురించి విన్నాం, చెక్కతో విఘ్నేశ్వరుని గురించి తెలుసుకున్నాం కానీ హైదరాబాద్ వనస్థలిపురంలోని రెడ్ ట్యాంక్ సమీపంలో వినూత్నంగా చిన్నపిల్లలు తినే జెమ్స్, అట్టముక్కలతో గణనాథుణ్ని తయారు చేశారు.
జెమ్స్ గణేశ్