లాక్డౌన్ దృష్ట్యా హైదరాబాద్ పాతబస్తీ నగరంలో పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పర్యటించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరా సాయంతో పరిశీలించారు. లాక్డౌన్ సందర్భంగా పాసులు కేవలం ఆహార వస్తువులు, నిత్యావసరాల తరలింపుకు మాత్రమే ఇచ్చామన్నారు. వాటిని దుర్వినియగం చేస్తే కేసు నమోదు చేసి వారి వాహనాలను జప్తు చేస్తామన్నారు.
'లాక్డౌన్ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు' - హైదరాబాద్ పాతబస్తీలో సీపీ అంజనీ పర్యటన
హైదరాబాద్‌లో పాతబస్తీ నగరాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డ్రోన్ కెమెరా సాయంతో వీక్షించారు. మే 7 వరకు లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
'లాక్డౌన్ కఠినంగా అమలు..అనవసరంగా బయటకు రావొద్దు'
ఉదయం నుంచి అడిషనల్ సీపీలు, డీసీపీలు విధుల్లో ఉంటున్నారని వెల్లడించారు. డెలివరీ అయిన మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు బయలుదేరిన 102 వాహనాన్ని మదీనా చౌరస్తా వద్ద ఛార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. మీడియా ప్రతినిధుల జోక్యంతో అంబులెన్స్‌ని పంపించారు.
ఇదీ చూడండి :మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు