మీ బాబులో వచ్చిన ప్రవర్తనే ఇప్పుడు చాలామంది చిన్నారుల్లో కనిపిస్తోంది. కరోనా వల్ల స్కూళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఆరునెలలు గడిచిపోయాయి. ఈ పరిస్థితి ఇంకెంత కాలం కొనసాగుతుందో తెలియదు.
దాంతో పిల్లల్లో క్రమశిక్షణ లోపిస్తోంది. పైగా వారు ఆటలు, స్నేహితులు, విహారం ఇలా అన్నింటికీ దూరంగా ఉన్నారు. దాంతో ఏదో కోల్పోయామన్న భావనలోకి వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు అమ్మఒడే బడిగా మారాలి.
ఇంట్లోనే ఓ గదినో, హాలునో చిన్నారి స్టడీ ప్లేస్‌గా మార్చేయండి. కార్పొరేట్ భాషలో.. వర్క్‌స్టేషన్‌గా తీర్చిదిద్దండి. అక్కడ ఓ టేబుల్, కుర్చీ, బ్లాక్ బోర్డ్, పుస్తకాలు, డిజిటల్ తెర వంటివన్నీ ఏర్పాటు చేయండి.
దాంతో తరగతి జరిగే సమయంలో పడుకోవడం, పరుగులెత్తడం వంటివన్నీ అదుపులోకి వస్తాయి. వారికి ఏకాగ్రత వస్తుంది. అలానే పాఠశాలకు వెళ్లేప్పుడు ఎలాంటి ప్రణాళికను అమలు చేశారో...ఇంట్లో ఉన్నా చిన్నారి దాన్ని సమయానికి పూర్తిచేసేలా చేయండి.