చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడబోయిన ఓ వృద్ధుడిని స్థానికుల సాయంతో పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఎల్బీనగర్కి చెందిన సుదర్శన్ రెడ్డి బైరామల్ చెరువులో దూకుతుండగా అక్కడ ఉన్న స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులకు తెలిపారు. వారు ఇరువురు కలిసి అతనిని బయటకు తీశారు.
చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన స్థానికులు, పోలీసులు - సీపీ మహేష్ భగవత్
ఓ వృద్ధుడు చెరువులో దూకుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు తెలిపారు. వెంటవే వచ్చిన పోలీసుల సాయంతో అతన్ని కాపాడిన వారిని సీపీ మహేష్ భగవత్ అభినందించారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన స్థానికులు, పోలీసులు
హుటాహుటిన అతనిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న సీపీ మహేష్ భగవత్ సిబ్బందిని, స్థానికులను అభినందించారు. దర్యాప్తు చేసిన పోలీసులు కుటుంబ కలహాల కారణంతో ఆత్మహత్యకు పాల్పడబోయినట్టు తెలిసింది.
ఇదీ చూడండి :ఒక్కరోజే 11 కేసులు.. అధికార యంత్రాంగం అప్రమత్తం