తెలంగాణ

telangana

ETV Bharat / state

మెడికల్ షాపులో బేకరీ పదార్థాలు... స్థానికులు ఆగ్రహం - telangana news

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ మెడికల్ షాపు యాజమాని లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. దుకాణం ముందు ఆహారపదార్థాలు, కూల్‌డ్రింక్స్‌ కోసం పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో ట్రాఫిక్ అంతరాయం జరుగుతోందని స్థానికులు పేర్కొన్నారు. మెడిసిన్ అండ్ మోర్ పేరుతో నిబంధనలు అతిక్రమించిన యాజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మెడికల్ షాపులో బేకరీ పదార్థాలు
మెడికల్ షాపులో బేకరీ పదార్థాలు

By

Published : Jun 6, 2021, 10:12 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ మెడికల్ షాపు యాజమాని లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. రోడ్ నెంబర్ 1లోని కేర్ ఆసుపత్రి వద్ద ఫార్మసీ పేరుతో ... బేకరీలో లభించే ఆహారపదార్థాలు, కూల్‌డ్రింక్స్‌, కాఫీ అమ్మకాలు సాగిస్తున్నాడనే ఆరోపణలు చేశారు.

దుకాణం ముందు కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో జనం బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. మెడిసిన్ అండ్ మోర్ పేరుతో నిబంధనలు అతిక్రమించిన యాజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!

ABOUT THE AUTHOR

...view details