' ఆ సమయంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయి' - తెలంగాణ వార్తలు
18:04 May 11
మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చు
తెలంగాణలో లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈమేరకు అబ్కారీ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీశాఖ నిబంధనల ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 10 గంటలలోపు తెరిచేందుకు అవకాశం లేదు. ఉదయం 10గంటల తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి.
అబ్కారీశాఖ అధికారులు మద్యం దుకాణాలను తెరిచే అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడగా.. ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఉదయం 6 నుంచి 10 గంటలవరకు మాత్రమే కార్యకలాపాలకు అవకాశమిచ్చింది. ఆ తర్వాత లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి.