గత ఏడాదికి వీడుకోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. నగరంలో ఆర్థరాత్రి వరకు బార్, రెస్టారెంట్‌లు అమ్మకాలకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో నగరంలోని పలు బార్ షాప్‌ల వద్ద మందుబాబులు బారులు తీరారు.
వైన్స్, బార్ల ముందు.. మందు బాబుల సందడి - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
హైదరాబాద్లో వైన్స్, బార్ల ముందు.. మందు బాబుల సందడి నెలకొంది. కొత్త సంవత్సరానికి ఆరంభం పలికే ముందు మద్యం ప్రియులు మందులో మునిగితేలుతున్నారు. మద్యం కొనేందుకు దుకాణాల ముందు క్యూ కడుతున్నారు.
వైన్స్, బార్ల ముందు.. మందు బాబుల సందడి
గ్రేటర్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు అధిక సంఖ్యలో మందు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మద్యం సేవించి వాహనం నడపొద్దని పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేశారు.