రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్ల, అదనపు కమిషనర్లకు ఆ శాఖ కమిషనర్ స్వయంగా సమాచారమిచ్చారు.
రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయి - Liqour shops timings news
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఈరోజు నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి
ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అబ్కారీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. తాజాగా మరో రెండు గంటల పాటు సమయాన్ని పొడిగించడం వల్ల మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి:రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు