కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్నార్థులకు అన్నదానం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, నాయకులు, సినీ తారలు ముందుకొస్తున్నారు.
'లాక్డౌన్ ఉన్నంతవరకు అన్నదానం చేస్తూనే ఉంటాం'
ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అన్నార్థులకు పలువురు బుల్లితెర ఆర్టిస్టులు అన్నదానం చేశారు. లాక్డౌన్ కొనసాగేవరకు పేదలకు భోజనం అందిస్తూనే ఉంటామని తెలిపారు.
'లాక్డౌన్ ఉన్నంతవరకు అన్నదానం చేస్తూనే ఉంటాం'
లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఫుట్‌పాత్‌లపై ఉంటున్న అన్నార్థులకు బుల్లితెర ఆర్టిస్టులు అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వద్ద ఫుట్‌పాత్‌లపై ఉన్న వారికి అన్నదానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ ఉన్నంత వరకు తమ సేవను కొనసాగిస్తామని వెల్లడించారు.