ఛత్తీస్‌గఢ్ దక్షిణ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టానికి 2.1 కి.మీ ఎత్తులో ఇది వ్యాపించి ఉంది. దీనితో పాటు ఉత్తర కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం - వర్షం తాజా వార్తలు
రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పింది.
వర్షం
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇదీ చదవండి:అమ్మో పురుగులు... వంతెన దాటాలంటే వెన్నులో వణుకే.!