ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ఎల్జీ ప్రధాన కార్యాలయం దక్షిణకొరియా నుంచి ప్రత్యేక బృందం విశాఖకు చేరుకుంది. 8 మంది సభ్యులతో కూడిన ఈ బృందం... ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులతో పాటు బాధితులకు పరిహారం వంటి అంశాలపై ఆరా తీయనుంది.
ప్రధాన కార్యాలయమైన సియోల్ నుంచి 8 మందితో కూడిన బృందాన్ని ఘటన స్థలానికి పంపాం. ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు బాధితులకు పునరావాస సహాయం అందించేందుకు క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పని చేస్తారు.