పెట్రో ధరలు తగ్గించాలని వామపక్షపార్టీలు గళమెత్తాయి. కేంద్రం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ముఖ్యమంత్రి స్పందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్నిచేపట్టారు.
Protest: పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని వామపక్షాల డిమాండ్ - పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ధర్నా
పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల వాతపెడుతున్నాయని విమర్శలు చేశారు.
Protest: పెట్రోల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని వామపక్షాల డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70 శాతం వరకు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెట్రో ధరల తగ్గింపునకు తక్షణం చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. కరోనా కట్టడిలోనూ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ఇదీ చూడండి:Errabelli : 'కొవిడ్ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి'