తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇండియా నుంచి ట్రంప్​ వెంటనే వెళ్లిపోవాలి' - namaste trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ వెంటనే భారతదేశం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్​ చేస్తూ... వామపక్షాలు ఆందోళనకు దిగాయి. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్​ కార్యాలయ ముట్టడికి ప్రయత్నం చేశారు.

left-parties-protest-at-us-consulate-office-in-hyderabad
'ఇండియా నుంచి ట్రంప్​ వెంటనే వెళ్లిపోవాలి'

By

Published : Feb 24, 2020, 3:31 PM IST

'ఇండియా నుంచి ట్రంప్​ వెంటనే వెళ్లిపోవాలి'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ రాకను నిరసిస్తూ... ​వామపక్షాలు ఆందోళనకు దిగాయి. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్​ కార్యాలయం వద్ద వామపక్ష నాయకులు, కార్యకర్తలు కాన్సులేట్​ ముట్టడికి ప్రయత్నం చేశారు. ప్లకార్డులతో విపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డగించి అరెస్ట్​ చేసి... పీఎస్​కు తరలించారు. విదేశీ పెత్తనం భారతదేశంపై ఉండొద్దని డిమాండ్​తో తాము నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు వామపక్ష నాయకులు తెలిపారు. వెంటనే ట్రంప్​ భారతదేశం నుంచి వెళ్లిపోవాలని వారు డిమాండ్​ చేశారు. విదేశీ పెత్తనం మూలంగా భారతదేశం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని నినాదాలు చేస్తూ... ఆందోళనకు దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వామపక్షాల నిరసనతో యూఎస్ కాన్సులేట్​లోకి వెళ్లే వారిని తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి:ట్రంప్‌తో దావత్‌కు.. సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details