మోదీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలిగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. దేశంలో మేధావులు, కమ్యూనిస్టులు పౌర హక్కుల నేతలపై అక్రమ కేసులు అపకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని పేర్కొన్నారు. దిల్లీలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై ఛార్జ్‌షీట్‌ను వ్యతిరేకిస్తూ.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద వామపక్షాలు, తెదేపా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని దేశంపై రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నారని నారాయణ ఆరోపించారు. సీతారం ఏచూరిపై పెట్టిన కేసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అక్రమ కేసులను వెంటనే ఉపసంహారించుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి: నారాయణ - సీపీఐ నారాయణ తాజా వార్తలు
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని దేశంపై రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు.దేశంలో మేధావులు, కమ్యూనిస్టులు, పౌర హక్కుల నేతలపై అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి: నారాయణ
ఏచూరిపై కేసును కమ్యూనిస్టుల మీద దాడిగా చూడాల్సి వస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. నిర్భందాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేధావులపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు మోదీ సర్కారు కుట్ర చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషా, తెదేపా నేత సాయిబాబా, పీవోడబ్ల్యూ నేత సంధ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడనుంది: భట్టి