తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్క ప్రాధాన్యత తెలుసుకోండి... నచ్చిన మొక్క కొనుక్కోండి - plants

విరభూసిన పుష్పాలతో కనివిందు చేస్తున్న మొక్కను చూస్తుంటే కళ్లార్పకుండా చూస్తుండిపోతాం... ఈ మొక్క ఎక్కడ కొన్నారు. ఎంతకు కొన్నారు సహా దాని గురించి కూపీ లాగే వరకు మనసు ఊరుకోదు. అలాంటిది వేలాది రకాల మొక్కలు ఓకే చోట దొరికితే.. ఇలాంటి అద్బుత అవకాశం ఎక్కడ ఉందా అనుకుంటున్నారా.. హైదరాబాద్​ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఉద్యాన ప్రదర్శన ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటోంది. రకరకాల మొక్కలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మొక్క ప్రాధాన్యత తెలుసుకోండి... నచ్చిన మొక్క కొనుక్కోండి

By

Published : Aug 18, 2019, 6:02 AM IST

మొక్కలంటే ఇష్టపడనివారుండరు. పువ్వులను చూసి ఆకర్షించబడని వారుండరు. ఎన్నో మొక్కలు పెంచుకోవాలని.. ఇళ్లంతా పచ్చదనంతో నింపేయాలని ఉన్నా అవి ఎక్కడ దొరుకుతాయో తెలీదు. ఎక్కడైనా ఓ అందమైన మొక్క కనిపిస్తే అరే ఇలాంటి మొక్కలు మనకు ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. మీలాంటి వారికోసమే హైదరాబాద్​లోని పీపుల్స్​ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. వేలాది రకాల పూల మొక్కలు, అలంకరణ మొక్కలు ప్రదర్శన, విక్రయానికి ఉంచారు.

ఇంతకు ముందెన్నడూ చూడని ఎన్నో రకాల మొక్కలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తల్లదండ్రులు తమ పిల్లలతో సహా వచ్చి మొక్కలను చూపిస్తూ వాటి ప్రాధాన్యతను వివరిస్తున్నారు. చిన్నారులు కూడా అమితానందంతో మొక్కల పెంపకంపై వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. నచ్చిన మొక్కలు కొనుక్కుని తీసుకెళ్తున్నారు.

బాల్యదశనుంచే పిల్లలకు మొక్క విలువ తెలపాలి

ఇంకెందుకు ఆలస్యం మీరు మీకు నచ్చిన మొక్కలు తెచ్చుకోండి. వాటి ఆవశ్యకతను పిల్లలకు తెలియజేయాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు... నేటి మొక్కలే రేపటి వృక్షాలు అన్నట్టుగా రేపటితరానికి ఆరోగ్యవంతమైన ప్రకృతిని అందించాలంటే పిల్లలకు బాల్యదశ నుంచే మొక్కల వల్ల ఉపయోగాలపై అవగాహన పెంచాలి.

మొక్క ప్రాధాన్యత తెలుసుకోండి... నచ్చిన మొక్క కొనుక్కోండి

ఇదీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు..

ABOUT THE AUTHOR

...view details