హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎస్ఆర్డీపీ ఫలాలు ఒక్కొక్కటి గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఫ్లై ఓవర్స్ , అండర్ పాసులు అందుబాటు లోకి రాగా.. అత్యంత రద్దీగా ఉండే ఎల్.బి.నగర్ జంక్షన్లో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్అలీ, తలసాని, నగర మేయర్ బొంతు రామ్మోహన్హాజరుకానున్నారు.
సాఫీగా ప్రయాణం..
ఒక కిలోమీటర్ పొడవునా ఎల్.బి.నగర్ ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. రూ.42 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ ప్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల దిల్సుఖ్నగర్ నుంచి విజయవాడ హైవే వరకు ప్రయాణం సులువవుతుంది. ఎల్.బి.నగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ నుంచి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా బండి ముందుకు సాఫీగా సాగిపోతుంది. దీనివల్ల సమయం ఆదా కావటంతోపాటు , పెట్రోల్ ఖర్చు మిగులుతుంది
సుమారు రూ.448కోట్లకు కోట్లతో ఎల్.బి.నగర్లో ఐదు జంక్షన్లను అభివృద్ది చేశారు. ఇప్పటికే చింతలకుంట అండర్ పాస్, కామినేని ప్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్లో రూ. 23వేల కోట్లతో ఎస్ఆర్డీపి పనులు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
రయ్..రయ్.. - talasani
ఎల్.బి.నగర్ జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఫ్లై ఓవర్ ప్రారంభంతో వాహనదారులు రయ్ రయ్మని దూసుకెళ్తున్నారు.
ప్రారంభానికి సిద్ధమైన ఫ్లైఓవర్
ఇదీ చదవండి: 'ఆధార్ 'గుర్తింపు''
Last Updated : Mar 1, 2019, 9:58 AM IST