హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్‌ను ఆనుకుని ఉన్న వ్యవసాయక్షేత్రంలో కొంత మంది యువత రేవ్ పార్టీ చేసుకున్నారు. గట్టిగా అరుపులు, కేకలు విన్పించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు తప్పతాగి చిందులేస్తున్న యువత కన్పించారు. 18 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి హుక్కా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. పాశ్చాత్య సంస్కృతి పేరుతో పెడదోవ పడుతున్న యువత ఇటువంటి పనులకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెబుతున్న ఎల్బీనగర్ ఏసీపీ గాంధీ నారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తప్పతాగి చిందులేస్తూ... అదే ఫ్యాషన్ అనుకుంటున్నారు - etv bharat chit chat with acp gandhi narayan
పాశ్చాత్య సంస్కృతి పేరిట పెడదోవ పడుతున్న యువత నగర శివారు ప్రాంతాల్లోని వ్యవసాయక్షేత్రాలను రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాగా చేసుకుంటున్నాయి. ఆ పార్టీల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటివి సేవిస్తూ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చిందేస్తూ అదే ఫ్యాషన్‌గా ఫీలవుతున్నారు.
ఎల్బీనగర్ ఏసీపీ గాంధీ నారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి
TAGGED:
lb nagar