హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్‌లో అమెజాన్ సంస్థ అతిపెద్ద ప్రాంగణాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ఐటీలో మేటి కంపెనీలు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా చేసుకున్నాయని.. అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నెలకొల్పడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగిందన్నారు హోం మంత్రి. ఫ్రెండ్లీ గవర్నమెంట్, వేగవంత అనుమతులు, చక్కటి ఐటీ పాలసీ, ఉత్తమ పారిశ్రామిక విధానం ద్వారా పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని నిలిపామని చెప్పారు. .
ప్రపంచంలోనే అతిపెద్దది
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని నానక్‌రామ్‌గూడలో అమెజాన్ నిర్మించింది. 2016 మార్చి 31న ఈ ప్రాంగణానికి అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 9.5 ఎకరాల్లో 15 అంతస్తులుగా 30 లక్షల చ.అ. విస్తీర్ణంలో అమెజాన్ ప్రాంగణం నిర్మాణమయింది. ఈ కేంద్రంలో 15 వేలకు పైగా ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం ఉంది. అలెక్స ప్యాడ్, కిడ్లీ వంటి ఏయూ సాంకేతికతతో కూడిన ఉత్పాదనలు రానున్నాయి. ఆసక్తితో కూడిన పని వాతావరణం, ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఈ క్యాంపస్ నిర్మించామని అమెజాన్ కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ అన్నారు. రోజుకు 2వేల మంది శ్రమించి మూడేళ్ళలో ఈ క్యాంపస్ ను పూర్తి చేయటం హర్షణీయమని కితాబిచ్చారు. కార్యక్రమానికి అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ స్కోట్లర్ హాజరయ్యారు.
హైదరాబాద్‌లో అతిపెద్ద అమెజాన్ ప్రాంగణం ప్రారంభం ఇదీ చూడండి: ప్రముఖుల పేర్లతో 50 బాటిళ్ల పార్శిల్స్ పంపిన అజ్ఞాతవ్యక్తులు