రాబోయే జమిలి ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని యువతే నడిపిస్తారని అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'జమిలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుంది' - హైదరాబాద్‌లో తెదేపా సమావేశం
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎవరూ అడ్డుకోలేరని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే జమిలి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు ప్రజలు ఉన్నంత కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఎల్ రమణ అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత అధికారం మెుత్తం కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం విమర్శించారు. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. విరాళాలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులివ్వడానికే పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యురో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు సుహాసిని, కోత్తకోట సీతాదయాకర్‌రెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.