తెలంగాణ

telangana

ETV Bharat / state

అఖిలపక్షాల పోరాటానికి మద్దతు: ఎల్​. రమణ

అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల రక్షణకు అఖిపక్షాలు చేస్తున్న పోరాటానికి తెదేపా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ తెలిపారు. బఫర్​ జోన్​లో కట్టడాలను తొలగించాలన్నారు.

l ramana support to all party party protest for land in medchal district
అఖిలపక్షాల పోరాటానికి మద్దతు: ఎల్​. రమణ

By

Published : Sep 2, 2020, 9:13 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ మండల పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల రక్షణకు అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటానికి తెదేపా మద్దతు ప్రకటించింది. నారాయణ రావు కాలువ వెంబడి బఫర్​జోన్​లో కట్టడాల తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్​ చేశారు.

భూముల రక్షణకు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలను టీపీసీసీ లీగల్​ సెల్​ జాయింట్​ కన్వీనర్​ పాలడుగు అమరేందర్ రెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ రమణకు వివరించారు. అఖిలపక్ష నాయకులు నిర్వహించే నిరసనలకు మద్దతు ఉంటుందని రమణ తెలిపారు.

ఇదీ చూడండి :ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ABOUT THE AUTHOR

...view details