తెలంగాణ

telangana

ETV Bharat / state

జీవన్​రెడ్డి విజయంతో తెరాస కంగు తిన్నది: కుంతియా - JEEVANREDDY

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి ఘనవిజయం సాధించటంపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోవటం ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా.

ఎమ్మెల్సీ విజయంపై కుంతియా స్పందన

By

Published : Mar 27, 2019, 4:09 PM IST

ఎమ్మెల్సీ విజయంపై కుంతియా స్పందన
ఈవీఎంలతో మతలబు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తెరాస... బ్యాలెట్‌ పేపరుతో జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలతో కంగుతిన్నదని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్‌ రెడ్డికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస పరాజయం చెందటం ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందన్నారు. ఇదే నిజమైన ప్రజా విజయమని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details