KTR Tweet on PM Modi: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. మరోసారి ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రధాన సమస్యలపై మోదీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ప్రకటించారని.. మరి ఇవాళ నిజామాబాద్‌లో పర్యటించనున్నందున.. ఈరోజు ఏం ప్రకటన చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి.. తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రధాన మంత్రి నిజామాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా 3 ప్రధాన హామీల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ఆ హామీలు ఏంటంటే..
- వరంగల్ జిల్లాలోని కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు
- బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు
- పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా దక్కేదెప్పుడు అని ప్రశ్నించారు.
KTR Tweet About AP Reorganization Act Guarantees : 'ఏపీ పునర్విభజన చట్టం హామీలు ఎటు పోయాయి'
KTR Questions Modi promises To Telangana : మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్రాని.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని మంత్రి కేటీఆర్ మోదీని నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతరజరిపిస్తారని మండిపడ్డారు. గుండెల్లో గుజరాత్‌ని పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ ఫైర్ అయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.