KTR about owaisi midhani flyover : హైదరాబాద్‌లో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా బల్దియా చేపట్టిన రహదారులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద.... ఓవైసీ, మిథాని కూడలిలో రూ.80కోట్ల వ్యయంతో 1.365 కిలోమీటర్ల మేర నిర్మించిన పైవంతెన రేపు అందుబాటులోకి రానుంది. మంగళవారం ప్రారంభించనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్ట్రాటజిక్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను హైదరాబాద్ ప్రజలకు అంకితమివ్వనున్నట్లు మంత్రి తెలిపారు. శరవేగంగా పనులు పూర్తిచేసిన ఎస్డీపీ బృందాన్ని అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
owaisi midhani flyover: ఓవైసీ, మిథాని కూడలి ఫ్లైఓవర్ రెడీ.. రేపే ముహూర్తం.. - ktr tweet
KTR about owaisi midhani flyover : హైదరాబాద్ నగరంలో ఓవైసీ, మిథాని కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన పైవంతెన అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈమేరకు ట్విటర్లో ఆయన ప్రకటించారు.
అందుబాటులోకి రానున్న ఓవైసీ, మిథాని కూడలి ఫ్లైఓవర్
వర్టికల్ గార్డెన్స్‌లో హైదరాబాద్.... దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. త్వరలోనే ప్రారంభం కానున్న షేక్ పేట్, ఓవైసీ ఫ్లైఓవర్లతో కలిపి.... పైవంతెనల ఫిల్లర్లపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ల సంఖ్య 79కి చేరుకోనుందని చెప్పారు.